దిల్లీ అనాజ్ మండీ ప్రాంతంలోని ఓ బహుళ అంతస్థుల భవనంలో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి ఓ వ్యక్తి ఏకంగా 11 మందిని సురక్షితంగా కాపాడారు. ప్రమాదం సంభవించిన భవనంలోకి మొదట ప్రవేశించిన దిల్లీ అగ్ని మాపక సిబ్బంది రాజేష్ శుక్లా... బాధితులను చాకచక్యంగా రక్షించారు. ఈ తరుణంలో ఆయన కాలికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శుక్లాను పరామర్శించారు దిల్లీ హోంమంత్రి సత్యేంద్ర జైన్.
"ఫైర్మన్ రాజేష్ శుక్లా ఓ నిజమైన హీరో. ప్రమాదం జరిగిన స్థలం లోపలకు వెళ్లిన తొలి వ్యక్తి ఈయనే. దాదాపు 11 మందిని ఒక్కడే కాపాడారు. అతని కాలు ఎముక విరిగినప్పటికీ...తన బాధ్యతను నిర్వర్తించారు. ఈ సాహసవీరుడికి వందనం."
-సత్యేంద్ర జైన్, దిల్లీ హోంమంత్రి.
అనుమతులు లేని భవనం
ప్రమాదం సంభవించిన భవనానికి అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు లేనట్లు తెలుస్తోంది. భవనాన్ని పూర్తిగా తనిఖీ చేసిన దిల్లీ అగ్ని మాపక శాఖ సిబ్బంది... పరిసరాల్లో ఎలాంటి అగ్ని మాపక పరికరాలు ఏర్పాటు చేయలేదని వెల్లడించారు.
బిహారీలకు రూ.2లక్షలు