తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ దంగల్​​: అధికారం మళ్లీ 'ఆమ్​ఆద్మీ'దే! - అరవింద్​ కేజ్రీవాల్​

delhi-elections-live-updates
దిల్లీ దంగల్

By

Published : Feb 8, 2020, 7:34 AM IST

Updated : Feb 29, 2020, 2:37 PM IST

18:36 February 08

మళ్లీ ఆప్​కే అధికారం!

హస్తిన పీఠం మరోమారు 'ఆమ్​ఆద్మీ'దేనా? అరవింద్ కేజ్రీవాల్​ మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమా? ఔననే అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్. దాదాపు అన్ని సర్వేలు ఆప్​ విజయం తథ్యమని అంచనా వేశాయి.  

2015తో పోల్చితే ఆప్​ ఆధిక్యం కాస్త తగ్గినా... ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో ఉంటుందని విశ్లేషించాయి. భాజపా కాస్త పుంజుకుంటుందని, కాంగ్రెస్​ ఏమాత్రం ప్రభావం చూపలేకపోవచ్చని అంచనా వేశాయి.

టైమ్స్​ నౌ- ఐపీఎస్​ఓఎస్​ సర్వే

  • ఆప్: 44
  • భాజపా+: 26
  • కాంగ్రెస్​: 0
  • ఇతరులు: 0

రిపబ్లిక్​ టీవీ- జన్​ కీ బాత్​ సర్వే

  • ఆప్: 48-61
  • భాజపా+: 9-21
  • కాంగ్రెస్​: 0-1
  • ఇతరులు: 0

నేత- న్యూస్​ ఎక్స్​ సర్వే

  • ఆప్: 53-57
  • భాజపా+: 11-17
  • కాంగ్రెస్​: 0-2
  • ఇతరులు: 0

ఏబీపీ- సి-ఓటర్​

  • ఆప్: 49-63
  • భాజపా+: 5-19
  • కాంగ్రెస్​: 0-4
  • ఇతరులు: 0

న్యూస్​ఎక్స్​-పోల్​స్ట్రాట్​

  • ఆప్: 50-56
  • భాజపా+: 10-14
  • కాంగ్రెస్​: 0
  • ఇతరులు: 0

దిల్లీలో మొత్తం 70 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. అధికారం చేజిక్కించుకోవాలంటే కనీసం 36 స్థానాలు గెలుచుకోవడం అవసరం. 2015 ఎన్నికల్లో ఆమ్​ఆద్మీ పార్టీ ఏకంగా 67 స్థానాలు దక్కించుకుని ప్రభంజనం సృష్టించింది. భాజపా 3 స్థానాలకు పరిమితమవగా... కాంగ్రెస్​ అసలు ఖాతా తెరవలేదు.

దిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితం ఈనెల 11న వెలువడనుంది. ఎగ్జిట్​ పోల్స్​ ఎంతమేర నిజం అయ్యాయో అదే రోజు తేలనుంది.

18:12 February 08

దేశ రాజధాని దిల్లీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందా? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాసేపట్లో వెలువడే ఎగ్జిట్​ పోల్స్ అంచనా​పై ఉత్కంఠ నెలకొంది.

18:02 February 08

ముగిసిన పోలింగ్

దేశ రాజధాని దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 70 స్థానాలకు జరిగిన పోలింగ్​లో 672 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు ఓటర్లు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్​ శాతం గణనీయంగా తగ్గింది. 2015లో 67 శాతం ఓటింగ్​ శాతం నమోదు కాగా ఈసారి 5 గంటల వరకు 54 శాతానికే పరిమితమైంది. ఓటింగ్ శాతం తగ్గడంపై దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు..

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్​ సహా అనేక మంది ప్రముఖులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​, మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ, దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్​ అనిల్​ బైజల్​, విదేశీ వ్యహరాల మంత్రి ఎస్ జైశంకర్, ఎన్నికల ప్రధాన అధికారు సునీల్ అరోడా, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తమ ఓటును వినియోగించుకున్నారు.

17:20 February 08

సాయంత్రం 5 గంటల వరకు 44.52శాతం పోలింగ్ నమోదైంది.

16:25 February 08

సాయంత్రం 4 గంటల వరకు 42.7శాతం పోలింగ్ నమోదైంది. 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడనున్నాయి.

15:19 February 08

3 గంటల వరకు 30...

దిల్లీ ఎన్నికల్లో ఓటింగ్​ శాతంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ ఆందోళన వ్యక్తం చేశారు. సమయం మించిపోతోందని... ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేయాలని అభ్యర్థించారు. 

అయితే మధ్యాహ్నం 3 గంటల వరకు 30.18శాతం పోలింగ్​ నమోదైంది.

15:04 February 08

ప్రణబ్​ ఓటు...

మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. న్యూదిల్లీలోని కామ్​రాజ్​ లేన్​ పోలింగ్​ కేంద్రంలో ఓటేశారు.

14:33 February 08

2 గంటల వరకు....

28.14%.. ఇదీ 2 గంటల వరకు దిల్లీలో నమోదైన పోలింగ్​. ఎన్నికల సమయం ముగుంపునకు దగ్గరవతున్నా... దిల్లీ ఓటర్లకు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు. దిల్లీ చరిత్రలోనే ఇదే అత్యల్ప పోలింగ్ శాతంగా నమోదయ్యే అవకాశాలున్నాయి.

13:31 February 08

ఓటేసిన ప్రియాంక...

లోధీ ఎస్టేట్​లో ప్రియాంక గాంధీ, రాబర్ట్​ వాద్రా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రియాంక తనయుడు రైహాన్​ వాద్రా తొలిసారి ఓటేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో పాలుపంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు రైహాన్​.

13:16 February 08

1 గంట వరకు....

దిల్లీలో ఓటర్లు ఓటు వేయడానికి ముందుకు వస్తున్నట్టుగా కనపడటం లేదు. ఇప్పటికే సగం సమయం ముగిసింది కానీ ఇంకా 20శాతం పోలింగ్​ మార్కును కూడా అందుకోలేదు. మధ్యాహ్నం 1 గంట వరకు 19.37శాతం ఓటింగ్​ మాత్రమే నమోదైంది.

13:08 February 08

సునీల్​ అరోడా...

ప్రధాన ఎన్నికల అధికారి సునీల్ అరోడా న్యూదిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలోని నిర్మల్​ భవన్​ పోలింగ్​ కేంద్రం వద్ద తన ఓటుహక్కు వినియోగించుకున్నారు.

12:23 February 08

నాలుగంటలైనా ఇంతే...!

దిల్లీ ఎన్నికలు మందకొడిగా సాగుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు కేవలం 15.68శాతం ఓటింగ్​ నమోదైంది. ఇళ్ల నుంచి బయటకు వచ్చి.. ఓటు హక్క వినియోగించుకోవాలని  ప్రముఖులందరూ విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. 

12:03 February 08

అడ్వాణీ ఓటు...

భాజపా అగ్రనేత అడ్వాణీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కూతురు ప్రతిభతో కలిసి ఔరంగజేబ్​ లేన్​లోని ఓ పోలింగ్​ కేంద్రం వద్ద ఓటు వేశారు.

11:39 February 08

ఆప్​- కాంగ్రెస్ మధ్య దంగల్​...

దిల్లీలోని మజ్నుకా తీలా వద్ద  ఓ అప్​ కార్యకర్త.. కాంగ్రెస్​ నేత అల్కా లంబ మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కార్యకర్తపై అల్కా లంబ చేయిచేసుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు పరిస్థితిని అదుపు చేయడానికి శ్రమించినా.. కాంగ్రెస్​ కార్యకర్తలు అతడిని అసభ్య పదజాలంతో దూషిస్తూనే ఉన్నారు. ఈ ఘటనను ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళతామని ఆప్​ సభ్యులు తెలిపారు.

11:37 February 08

11 గంటల వరకు 6.96శాతం...

ఎన్నికలు మొదలైన తొలి మూడు గంటల్లో కేవలం 6.96శాతం ఓటింగ్​ నమోదైంది.

10:52 February 08

కాంగ్రెస్​ నేతలు...

కాంగ్రెస్​ నేతలు ఒక్కొక్కరుగా పోలింగ్​ కేంద్రాలకు తరలివెళ్తున్నారు. న్యూ దిల్లీ నియోజకవర్గంలో మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​, ఔరంగజేబ్​ రోడ్డులో రాహుల్​ గాంధీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

10:48 February 08

110ఏళ్లయినా.. ఓటే ముఖ్యం...

110 ఏళ్ల వృద్ధురాలు కలితార మండల్​.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రేటర్​ కైలాశ్​ నియోజకవర్గంలోని ఓ పోలింగ్​ కేంద్రం వద్ద ఓటు వేశారు. అనంతరం సిరా చుక్కను మీడియాకు ప్రదర్శించారు.

10:39 February 08

ఓటేసిన రాష్ట్రపతి...

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​.. సతీమణితో కలిసి కేంద్రీయ విద్యాలయ(ప్రెసిడెంట్​ ఎస్టేట్​)లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

10:19 February 08

పెళ్లికి ముందు...

షాకర్​పుర్​లోని పోలింగ్​ కేంద్రం వద్ద ఓ వరుడు క్యూలో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. 

10:11 February 08

కేవలం 4.55శాతం...

పోలింగ్​ మందకొడిగా సాగుతోంది. ఉదయం 10 గంటల వరకు కేవలం 4.55శాతం ఓటింగ్​ నమోదైంది.  

09:50 February 08

కేజ్రీవాల్​ ఓటు...

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సమేతంగా న్యూ దిల్లీ నియోజకవర్గంలోని పోలింగ్​ కేంద్రం వద్ద ఓటు వేశారు. సామాన్యులతో పాటు క్యూలో ఉండి ఓటేశారు.

09:08 February 08

ప్రశాంతంగా పోలింగ్​...

దిల్లీలో పోలింగ్​ ప్రశాంతంగా సాగుతోంది. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి తరలివెళ్తున్నారు. సాంకేతిక కారణాల వల్ల యమున విహార్​లోని సీ10 బ్లాక్​ కేంద్రం వద్ద ఓటింగ్​ ఇంకా ప్రారంభం కాలేదు. ప్రజలు తీవ్ర అసహనానికి గురవుతున్నారు.

మరోవైపు గ్రేటర్​ కైలాశ్​లో లెఫ్టినెంట్​ గవర్నర్​ అనిల్​, న్యూ దిల్లీలో మాజీ ఉపరాష్ట్రపతి హమిద్​ అన్సారీ తమ ఓటు వేశారు.

08:45 February 08

భాజాపా ఎంపీ పర్వేశ్​ వర్మ... మటియాలా నియోజకవర్గంలోని పోలింగ్​ కేంద్రంలో ఓటు హక్కను వినియోగించుకున్నారు. మరోవైపు తుగ్లక్​ క్రీసెంట్​ రోడ్డులో సుప్రీం న్యాయమూర్తి జస్టిస్​ ఆర్​. భానుమతి ఓటు వేసేందుకు పోలింగ్​ కేంద్రానికి చేరుకున్నారు. 

08:26 February 08

షహీనాబగ్​లో బారుల తీసిన ఓటర్లు

షహీనాబగ్​లో తమ ఓటు హక్కును వినియోగించేందుకు తన ఓటరు కార్డును చూపిస్తూ బారులు తీసిన ప్రజలు.

08:12 February 08

ప్రముఖుల ఓట్లు...

దిల్లీ దంగల్​ ప్రారంభమైంది. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్​ కేంద్రాలకు తరలివెళ్తున్నారు. రాజకీయ ప్రముఖులు కూడా పోలింగ్​ కేంద్రాలకు చేరుకుంటున్నారు. విదేశాంగమంత్రి జైశంకర్​, భాజపా నేత రామ్​ మాదవ్​ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

08:02 February 08

పోలింగ్​ ప్రారంభం...

70 స్థానాలున్న దిల్లీ శాసనసభకు పోలింగ్​ ప్రారంభమైంది. దాదాపు కోటీ 47 లక్షలమంది ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. సాయంత్రం 6గంటల వరకు పోలింగ్​ సాగనుంది.

07:47 February 08

ఓటరు చూపు ఎటువైపు?

దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న దిల్లీ శాసనసభ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ ఎన్నికల్లో అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ సహా భాజపా, కాంగ్రెస్‌ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగుతోంది ఆప్​. గత అయిదేళ్లుగా అన్ని వర్గాలకు అమలు చేసిన సంక్షేమ పథకాలు తమను తిరిగి గెలిపిస్తాయని గట్టి విశ్వాసంతో ఉంది. 

9నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దిల్లీలో మొత్తం 7 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకున్న భాజపా... ఈ సారి ప్రజలు తమను మరింత ఆదరిస్తారనే నమ్మకంతో ఉంది. జేడీయూ, లోక్‌జన శక్తి పార్టీతో కలిసి పోటీ చేస్తోంది. 67 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. ఈ ఎన్నికల్లో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రధాని మోదీ చరిష్మా తమను గెలిపిస్తాయని భావిస్తోంది. 

07:08 February 08

70 స్థానాలు... 672 మంది అభ్యర్తులు

మరి కొద్దిసేపట్లో దిల్లీ పోలింగ్​ ప్రారంభంకానుంది. మొత్తం 70 స్థానాలకు 672 మంది బరిలో ఉన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 

కోటి 47 లక్షల మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొననున్నారు. 13వేల 750 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ప్రజలు పోలింగ్​ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఉదయం 8 గంటలకు నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్​ జరగనుంది.  

Last Updated : Feb 29, 2020, 2:37 PM IST

ABOUT THE AUTHOR

...view details