తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ దంగల్: మెజారిటీ స్థానాల్లో ఆప్​ ముందంజ

దిల్లీ ఎన్నికల ఫలితాల సమయం వచ్చేసింది. ఇవాళ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మెజారిటీ స్థానాల్లో ఆమ్​ఆద్మీ పార్టీ అభ్యర్థులు ఆధిక్యం కనబరుస్తున్నారు.

Delhi election: Counting of votes begins
దిల్లీ దంగల్:ఓట్ల లెక్కిపు ప్రారంభం... విజయం ఎవరిదో?

By

Published : Feb 11, 2020, 8:55 AM IST

Updated : Feb 29, 2020, 10:53 PM IST

దేశమంతటా ఎంతో ఉత్కంఠ రేకెత్తిస్తోన్న దిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్​ మొదలైంది. ఈ సారి కూడా ఆమ్​ ఆద్మీ పార్టీకే విజయం వరిస్తుందని ఎగ్జిట్​ పోల్స్​ అంచనా వేశాయి. ఇప్పటివరకు ఆప్​ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు... పలు విడతల్లో జరుగుతుందని దిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి రణ్​బీర్ సింగ్​ తెలిపారు. పలు కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఈసీ నిర్దేశించిన విధానాల మేరకు ప్రక్రియ కొనసాగుతుందని సింగ్​ వివరించారు.

ఫిబ్రవరి 8న జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం 672 మంది అభ్యర్థులు బరిలో దిగారు. పోలింగ్ ముగిసిన 24 గంటల తర్వాత ఓటింగ్​ శాతాన్ని 62.59గా ఎన్నికల సంఘం ప్రకటించింది. 2015తో పోలిస్తే ఇది 5 శాతం తక్కువ.

Last Updated : Feb 29, 2020, 10:53 PM IST

ABOUT THE AUTHOR

...view details