తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ ఉప ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్ - Manish Sisodia COVID positive

దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్​లో వెల్లడించారు. ప్రస్తుతం ఐసోలేషన్​కు వెళ్లినట్లు తెలిపారు.

Delhi Deputy Chief Minister Manish Sisodia tests positive for COVID-19
దిల్లీ ఉప ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్

By

Published : Sep 15, 2020, 5:29 AM IST

ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు, దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా సోమవారం కరోనా వైరస్‌ బారిన పడ్డారు. తాజాగా ఆయన కొవిడ్‌-19 పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా వెల్లడైంది. దీంతో ఆయన తనంతట తానే ఐసోలేషన్‌కు వెళ్లారు. ఈ మేరకు ఆయనే స్వయంగా ట్విటర్‌లో వెల్లడించారు.

'ప్రస్తుతానికి నేను బాగానే ఉన్నా. ఎలాంటి జ్వరం ఇతర లక్షణాలూ లేవు. మీ అందరి ఆశీర్వాదాలతో త్వరలోనే కోలుకుని మళ్లీ విధుల్లోకి వస్తా' అంటూ ట్వీట్ చేశారు సిసోడియా.

కాగా దిల్లీలో ఇప్పటి వరకు 2లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా.. వారిలో 1.88వేల మంది తిరిగి కోలుకున్నారు. ప్రస్తుతం 28వేలకు పైగా యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు దిల్లీ వైద్యశాఖ వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details