రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రచించిన రెండు పుస్తకాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విడుదల చేశారు. 'రిపబ్లికన్ ఎథిక్', 'లోక్తంత్ర కే స్వర్' పేర్లతో ఈ పుస్తకాన్ని రాశారు కోవింద్.
రాష్ట్రపతి రచనలను ఆవిష్కరించిన రాజ్నాథ్ - రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రచించిన పుస్తకాలను ఆవిష్కరించారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. దేశంలోని వర్తమాన పరిస్థితులకు ఈ పుస్తకాలు అద్దం పడతాయని పేర్కొన్నారు.
'వర్తమాన పరిస్థితులకు అద్దం పట్టే పుస్తకాలివి'
రాష్ట్రపతి పదవి అలంకరించిన మూడేళ్ల కాలంలో.. ఆయన చేసిన ప్రసంగాలను ఇందులో పొందుపరిచారు. 'వర్తమానానికి ఈ పుస్తకాలు తార్కాణంగా నిలుస్తాయ'ని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. కార్యక్రమానికి మరో కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ హాజరయ్యారు.
ఇదీ చూడండి:ప్రమాణం చేసిన 3 రోజులకే మంత్రి రాజీనామా