భారత్‌లో.. కరోనా కేసులు 91వేలకు చేరువయ్యాయి. ఒకేరోజు దాదాపు 5వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆదివారం ఉదయానికి మొత్తం కరోనా కేసుల సంఖ్య 90,927వేలకు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇందులో 53, 946 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు మరో 34,108 మంది కోలుకున్నారు. 2,872మంది మరణించారు.
రాష్ట్రాలను ఊపిరాడనీక..
రోజూ రోజూకూ పెరుగుతున్న కేసులతో.. భారత రాష్ట్రాలపై కరోనా పంజా విసురుతోంది. ఒక్క మహారాష్ట్రలోనే సుమారు 30,706 మందికి సోకిన ఈ మహమ్మారి.. గుజరాత్, తమిళనాడులో పదివేల మందికి పైగా వ్యాపించింది. ఇక దిల్లీలోనూ కేసుల సంఖ్య 10వేలకు చేరువలో ఉంది.
రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్‌లో 5వేలకు సమీపంలో వైరస్ కేసులు నమోదయ్యాయి. బంగాల్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్‌లలో దాదాపు 2వేల పాజిటివ్ కేసులుండగా.. తెలంగాణ, బిహార్, జమ్ముకశ్మీర్‌లలో వెయ్యి కేసులు దాటేశాయి.
ఒడిశా, కేరళ రాష్ట్రాల్లో 5 వందలకు పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఝార్ఖండ్, ఛండీగఢ్, త్రిపురలో 200కు అటూ, ఇటుగా ఉన్నాయి. అసోం, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్,ఛత్తీస్‌గఢ్, లద్ధాఖ్‌లలో 100లోపు కేసులు నమోదయ్యాయి..
ఒక్క రోజులో..!
దేశవ్యాప్తంగా ఒక్క రోజులో 120 మంది వైరస్‌తో పోరాడుతూ కన్నుమూశారు. అన్ని రాష్ట్రాల్లో కలిపి దాదాపు 5వేల కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రాలు వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మరింత తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
దిల్లీ- ఒకే రోజులో కొత్తగా 422 కరోనా కేసులు నమోదయ్యాయి. 19 మంది వైరస్ ధాటికి మరణించారు.