తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈ నెల 16న 'ఉన్నావ్' అత్యాచార కేసు తీర్పు - 16న ఉన్నావ్ 'సెంగార్​' అత్యాచార తీర్పు

ఉన్నావ్ అత్యాచార కేసు తీర్పును దిల్లీ కోర్టు ఈ నెల 16కు  వాయిదా వేసింది. భాజపా నేత కుల్​దీప్ సెంగార్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ కేసు విచారణలో ఇప్పటికే సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసే ప్రక్రియ పూర్తయ్యింది. సీబీఐ వాదనలు ముగిసిన నేపథ్యంలో తీర్పును రిజర్వు చేసింది కోర్టు.

sengar
16న ఉన్నావ్ 'సెంగార్​' అత్యాచార తీర్పు

By

Published : Dec 11, 2019, 5:46 AM IST

Updated : Dec 11, 2019, 6:16 AM IST

భాజపా బహిష్కృత నేత కుల్‌దీప్‌ సెంగార్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉన్నావ్ అత్యాచార కేసు తీర్పును దిల్లీ కోర్టు ఈ నెల 16కు రిజర్వ్‌ చేసింది. ఈ కేసుకు సంబంధించి సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసే ప్రక్రియ ఇప్పటికే పూర్తి అయింది. దర్యాప్తు సంస్థ సీబీఐ వాదనలు సోమవారంతో ముగిశాయి. ఈ నేపథ్యంలో తీర్పును ఈ నెల 16న వెలువరించనున్నట్లు కోర్టు తెలిపింది.

2017లో ఓ మైనర్ బాలికను అపహరించి, అత్యాచారం చేశారంటూ కుల్‌దీప్ సెంగార్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వార్తల అనంతరం సెంగార్‌నుభాజపా పార్టీ నుంచి బహిష్కరించింది. అయితే కేసు విచారణ దశలో ఉండగానే ఈ ఏడాది జులైలో బాధితురాలు ప్రయాణిస్తున్న కారును కొంతమంది దుండగులు ట్రక్కుతో ఢీ కొట్టారు . ఈ ఘటనలో బాధితురాలి బంధువులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన వెనుక కుల్‌దీప్‌ సెంగార్ ఉన్నారంటూ బాధితురాలు ఆరోపించగా సీబీఐ విచారణ చేపట్టింది.

Last Updated : Dec 11, 2019, 6:16 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details