తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉన్నావ్ కేసు: కుల్​దీప్​ సెంగార్​కు నేడే శిక్ష ఖరారు! - Delhi court to sentence Kuldeep Sengar in Unnao rape Case

ఉన్నావ్ అత్యాచార కేసులో కుల్​దీప్​ సెంగార్​కు నేడు శిక్ష ఖరారు చేయనుంది దిల్లీ జిల్లా కోర్టు. విచారణ అనంతరం భారతీయ శిక్షా స్మృతి, పోక్సో చట్టాల కింద కుల్​దీప్​ సెంగార్‌కు శిక్ష పడనుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ అత్యాచార ఘటనలో కుల్​దీప్​​ను ఇదివరకే దోషిగా తేల్చింది న్యాయస్థానం.

Delhi court to sentence Kuldeep Sengar in Unnao rape Case
ఉన్నావ్ కేసు: కులదీప్​ సెంగార్​కు నేడే శిక్ష ఖరారు!

By

Published : Dec 20, 2019, 5:55 AM IST

Updated : Dec 20, 2019, 7:00 AM IST

ఉన్నావ్​ అత్యాచార కేసుపై దిల్లీ జిల్లా కోర్టు నేడు విచారణ చేపట్టనుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో భాజపా బహిష్కృత ఎమ్మెల్యే కుల్​దీప్​​ సెంగార్​ దోషిగా తేలినందున ఇవాళే శిక్ష ఖరారు చేసే అవకాశముంది.

సెంగార్‌కు శిక్ష విధింపుపై ఈ మంగళవారమే న్యాయస్థానంలో వాదనలు జరిగాయి. కుల్​దీప్​కు జీవిత ఖైదు విధించాలని సీబీఐ వాదనలు వినిపించింది. న్యాయం కోసం వ్యవస్థపై ఒక వ్యక్తి చేసిన పోరాటం కనుక ఈ కేసులో కుల్​దీప్​కు గరిష్ఠ శిక్ష అయిన జీవిత ఖైదు విధించాలని కోరింది. అత్యాచార బాధితురాలికి సరైన పరిహారం చెల్లించాలంది.

ఈ నేపథ్యంలో సెంగార్‌ ఆర్థిక పరిస్థితి తెలుసుకునేందుకు ఎన్నికల నామినేషన్‌ పత్రాలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. బాధితురాలికి పరిహారం చెల్లింపునకు సెంగార్‌ ఆర్థిక పరిస్థితిని న్యాయస్థానం పరిశీలించనుంది. ఈ అంశాలపై నేడు విచారణ జరపనుంది. అనంతరం శిక్ష ఖరారు చేసే అవకాశముంది.

ఉద్యోగం కావాలని వెళ్లిన 17 ఏళ్ల బాలికపై 2017 జూన్‌ 4న కులదీప్‌ సెంగార్‌ అత్యాచారం చేసినట్లు రుజువైంది. భారతీయ శిక్షా స్మృతి, పోక్సో చట్టాల కింద కుల్​దీప్​ సెంగార్‌కు శిక్ష పడనుంది.

Last Updated : Dec 20, 2019, 7:00 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details