నిర్భయ కేసులో నలుగురు దోషులను ఉరితీసేందుకు కొత్త తేదీ ప్రకటించాలని తీహార్ జైలు అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌ను పటియాలా హౌజ్ కోర్టు తోసిపుచ్చింది. దోషులు తమకున్న న్యాయపరమైన అవకాశాలను వారం రోజుల్లోగా వినియోగించుకోవాలని ఈనెల 5న దిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా దిల్లీ హైకోర్టు ఉత్తర్వులను ప్రస్తావించిన న్యాయమూర్తి.. దోషులు జీవించేందుకు చట్టం అనుమతించిన తర్వాత కూడా వారిని ఉరితీయటం నేరపూరిత పాపమవుతుందన్నారు.
నిర్భయ కేసు: తీహార్ జైలు అధికారుల పిటిషన్ కొట్టివేత
నిర్భయ దోషులను ఉరి తీసేందుకు కొత్త తేదీని ప్రకటించాలని తీహార్ జైలు అధికారులు వేసిన పిటీషన్ను దిల్లీ కోర్టు తోసిపుచ్చింది. దోషులు జీవించేందుకు చట్టం అనుమతించిన తర్వాత వారిని ఉరితీయటం నేరపూరిత పాపమని అభిప్రాయపడింది.
నిర్భయ దోషులు: తీహార్ జైలు అధికారుల పిటిషన్ కొట్టివేత
ఊహాజనిత సమాచారం ఆధారంగా డెత్ వారెంట్ జారీ చేయకూడదన్న దోషుల తరఫు న్యాయవాది వాదనతో ఏకీభవిస్తూ.. తిహార్ జైలు అధికారుల పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు జడ్జి తీర్పునిచ్చారు. అయితే అవసరమైనప్పుడు పిటిషన్ దాఖలు చేసే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: విమానాశ్రయంలో 'ఎలుగుబంటి' డ్యూటీ!
Last Updated : Feb 29, 2020, 1:02 PM IST