సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులకు వెంటనే డెత్ వారెంట్లు జారీ చేయాలని కోరుతూ నిర్భయ తల్లిదండ్లులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణను దిల్లీ కోర్టు వాయిదా వేసింది. నిర్భయ దోషుల్లో ఒకడైన అక్షయ్ కుమార్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ డిసెంబర్ 17న విచారణకు రానుండటమే ఇందుకు కారణం.
"సుప్రీం కోర్టులో నిందుతుడి రివ్యూ పిటిషన్ పెండింగ్లో ఉన్నందున అప్పటివరకు వేచి చూడాలని నేను భావిస్తున్నా. అందుకే పిటిషన్పై విచారణను ఈ నెల 18కి వాయిదా వేస్తున్నాను." - సతీశ్ కుమార్ అరోడా, దిల్లీ పటియాలా హౌస్ కోర్టు జడ్జి
ఏడేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నామని, మరో వారం రోజులు ఎదురుచూస్తామని.. వాయిదా వేసిన అనంతరం నిర్భయ తల్లి మీడియాతో అన్నారు.