తెలంగాణ

telangana

ETV Bharat / bharat

7 నెలల తర్వాత దిల్లీలో అతి తక్కువ కేసులు - 500కు కన్నా తక్కువ కేసులు

దిల్లీలో కరోనా తగ్గుముఖం పడుతోంది. 7 నెలల తర్వాత అక్కడ తొలిసారిగా 500 కన్నా తక్కువ కేసులు నమోదవ్వడం ఆశించదగ్గ పరిణామం. అయితే మహమ్మారి తగ్గుముఖం పట్టినా.. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందేనని దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ హెచ్చరిస్తున్నారు.

lowest-covid-cases-reported-in-delhi-over-last-7-months
7 నెలల తర్వాత దిల్లీలో అతి తక్కువ కరోనా కేసులు!

By

Published : Jan 2, 2021, 10:12 PM IST

కరోనా వైరస్‌ విజృంభణతో ఉక్కిరిబిక్కిరైన దేశ రాజధాని నగరం ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటోంది. ఏడు నెలల తర్వాత తొలిసారి 500 కన్నా తక్కువ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం 67,364 శాంపిల్స్‌ పరీక్షించగా 494 కొత్త కేసులు వచ్చాయి. 14 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుత పాజిటివిటీ రేటు 0.73 శాతంగా ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ దిల్లీలో 6,26,448 కేసులు నమోదు కాగా.. 10,561మంది ప్రాణాలు కోల్పోయారు.

మరోవైపు, కరోనా పరిస్థితిపై దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్​ జైన్ ట్వీట్ ‌ చేశారు. గత 11 రోజుల్లో కరోనా పాజిటివిటీ రేటు ఒకశాతం కన్నా తక్కువగా కొనసాగుతోందన్నారు. 'మే 17 తర్వాత తొలిసారి 500 కన్నా తక్కువ కేసులు నమోదయ్యాయని.. నవంబర్‌ 7నాటికి పాజిటివిటీ రేటు 15.26 శాతం ఉండగా.. ప్రస్తుతం 0.73శాతానికి తగ్గిందని తెలిపారు. ఇది గడిచిన 11 రోజుల కన్నా 1శాతం తక్కువేనని.. నవంబర్‌ 13 నాటికి రాష్ట్రంలో ఉన్న యాక్టివ్‌ కేసులు 44,456 కాగా ఇప్పుడు 5,342కి చేరుకున్నాయని వివరించారు. మూడో దశ విజృంభణ తగ్గుతున్నప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి సీడీఎస్‌సీఓ అనుమతి

ABOUT THE AUTHOR

...view details