తెలంగాణ

telangana

By

Published : Dec 4, 2019, 9:02 PM IST

Updated : Dec 4, 2019, 10:42 PM IST

ETV Bharat / bharat

106 రోజుల నిరీక్షణ.. 'తిహార్' నుంచి చిదంబరం రిలీజ్​

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్​ సీనియర్​ నేత పి చిదంబరం.. 106 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు మద్దతుగా తిహార్​ జైలుకు చాలా మంది కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. చిదంబరం విడుదలపై కాంగ్రెస్​తో పాటు ఆయన కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఐఎన్​ఎక్స్​ మీడియా మనీలాండరింగ్​ కేసులో భాగంగా సుప్రీం కోర్టు ఇవాళ బెయిల్​ మంజూరు చేసింది. ఈ సందర్భంగా పలు ఆంక్షలు విధించింది.

delhi-congress-leader-p-chidambaram-released-from-tihar-jail
106 రోజుల తర్వాత బయటకు చిదంబరం... పలువురి హర్షం

106 రోజుల నిరీక్షణ.. 'తిహార్' నుంచి చిదంబరం రిలీజ్​

ఐఎన్​ఎక్స్​ మీడియా మనీలాండరింగ్‌ కేసులో భాగంగా 106 రోజులుగా కస్టడీలో ఉన్న కాంగ్రెస్ నేత పి చిదంబరానికి ఎట్టకేలకు విముక్తి లభించింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో.. తాజాగా జైలు నుంచి విడుదలయ్యారు కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి. 106 రోజుల తర్వాత జైలు నుంచి బయటకు వస్తున్న చిదంబరానికి మద్దతుగా తిహార్‌ జైలుకు భారీగా మద్దతుదారులు చేరుకున్నారు.

ఈడీ కేసులో భాగంగా సర్వోన్నత న్యాయస్థానం చిదంబరానికి బుధవారం బెయిల్‌ మంజూరు చేసింది. రూ.2 లక్షల రూపాయల బాండు, ఇద్దరి పూచీకత్తుపై బెయిల్‌ ఇచ్చింది. కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లొద్దని, సాక్షులతో సంప్రదింపులు జరపవద్దని ఆంక్షలు విధించింది. కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడరాదని ఆజ్ఞాపించింది.

ఈడీ కేసులో దిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరిస్తూ నవంబర్ 15న తీర్పునివ్వగా.. దీనిపై సుప్రీం కోర్టులో సవాల్​ చేశారు చిదంబరం. ఈ పిటిషన్​పై ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ ఆర్ భానుమతి నేతృత్వంలోని ధర్మాసనం.. నవంబర్ 28న తీర్పును వాయిదా వేసింది. ఇవాళ బెయిల్‌ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.

కుటుంబ సభ్యుల హర్షం..

చిదంబరం విడుదలపై హర్షం వ్యక్తం చేశారు ఆయన భార్య నళినీ చిదంబరం, కుమారుడు కార్తీ చిదంబరం. 'చివరకు 106 రోజుల తర్వాత' అంటూ ట్వీట్​ చేశారు కార్తీ.

సత్యమే గెలిచింది: కాంగ్రెస్​

చిదంబరానికి బెయిల్​ మంజూరుపై సుప్రీం నిర్ణయాన్ని స్వాగతించింది కాంగ్రెస్​ పార్టీ. చివరకు సత్యమే గెలిచింది, సత్యమేవ జయతే వంటి హ్యాష్​ట్యాగ్​లతో ట్వీట్​ చేసింది కాంగ్రెస్​. ఎంతో ముందుగానే సుప్రీం కోర్టు ఈ నిర్ణయం తీసుకోవాల్సిందని కాంగ్రెస్​ సీనియర్​ నేత శశిథరూర్​ వ్యాఖ్యానించారు.

ప్రతీకారంతోనే జైలుకు..

చిదంబరంపై ప్రతీకారంతోనే జైలుకు పంపారని ఆరోపించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు ట్వీట్​ చేశారు. భవిష్యత్తులో ఎదుర్కోబోయే విచారణలో ఆయన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటారన్న నమ్మకం ఉందన్నారు.

ఇదీ కేసు..

చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు.. ఐఎన్​ఎక్స్​ మీడియాకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు అనుమతులు ఇవ్వడంలో అవకతవకలకు పాల్పడినట్లు 2017 మే 15న సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసు ఆధారంగా ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ మనీలాండరింగ్ కేసు పెట్టింది. గత ఆగస్టు 21న కస్టడీలోకి తీసుకుంది సీబీఐ, అనంతరం అక్టోబర్​ 16న ఈడీ అదుపులోకి తీసుకుంది. ఆగస్టు 21 నుంచి కస్టడీలో ఉన్నారు చిదంబరం. సీబీఐ కేసులో చిదంబరం ఇప్పటికే బెయిల్‌పై ఉన్నారు.

Last Updated : Dec 4, 2019, 10:42 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details