తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ సీఎం కేజ్రీవాల్​ గృహ నిర్బంధం! - కేజ్రీవాల్​ హౌస్​ అరెస్ట్​

దీల్లీ సీఎం కేజ్రీవాల్​ను పోలీసులు గృహ నిర్బంధంలో పెట్టారని ఆప్​ ఆరోపించింది. ఆయన్ను బయటకు రానివ్వడం లేదని తెలిపింది. అయితే ఈ ఆరోపణలను దిల్లీ పోలీసులు ఖండించారు. సీఎంను గృహ నిర్బంధంలో పెట్టలేదని.. ఆయన ఎప్పుడైనా బయటకు రావచ్చని స్పష్టం చేశారు.

Delhi CM under house arrest claims AAP
దిల్లీ సీఎం కేజ్రీవాల్​ గృహ నిర్బంధం!

By

Published : Dec 8, 2020, 11:57 AM IST

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ను పోలీసులు గృహ నిర్బంధం చేసినట్టు ఆప్​ ఆరోపించింది. సోమవారం సింఘు సరిహద్దు వద్ద రైతులను కలిసిన అనంతరం పోలీసులు ఈ చర్యలు చేపట్టారని పేర్కొంది.

"కేంద్ర హోంశాఖ ఆదేశాలతో దిల్లీ పోలీసులు.. సీఎం కేజ్రీవాల్​ను గృహ నిర్బంధంలో పెట్టారు. సింఘు సరిహద్దు వద్ద అన్నదాతలను కలిసిన అనంతరం కేజ్రీవాల్​పై ఈ చర్యలు తీసుకున్నారు. నివాసాన్ని వీడేందుకు, లోపలికి వెళ్లేందుకు ఎవరినీ అనుమతించడం లేదు. మా ఎమ్మెల్యేలను కొట్టారు. ఆయన నివాసం వద్ద భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పని మనిషిని కూడా లోపలికి వెళ్లనివ్వడం లేదు. సీఎం నివాసానికి మేము తరలివెళ్లి ఆయన విడుదలకు డిమాండ్​ చేస్తాం."

--- సౌరభ్​ భరద్వాజ్​, ఆప్​ ప్రతినిధి.

అయితే ఆప్​ ఆరోపణలను దిల్లీ పోలీసులు ఖండించారు. అవి నిజం కాదని తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి బయటకు వచ్చి, ఎప్పుడైనా, ఎక్కడికైనా వెళ్లొచ్చని స్పష్టం చేశారు. కేవలం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే కేజ్రీవాల్​ ఇంటివద్ద బలగాలను మోహరించినట్టు వివరించారు.

ఇవీ చూడండి:-

ABOUT THE AUTHOR

...view details