'హింసాత్మక అల్లర్లకు పాల్పడినవారు ఏ పార్టీకి చెందినవారైనా సరే వారిని విడిచిపెట్టొద్దు' అని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. హింసాత్మక ఘటనలతో అట్టుడికిన ఈశాన్య దిల్లీ గురించి మోదీతో చర్చించారు ఆయన. పోలీసులు ఎంతో శ్రమించి పిరిస్థితిని అదుపులోకి తెచ్చారని కొనియాడారు.
దిల్లీలో తిరిగి అధికారంలోకి వచ్చాక తొలిసారి మోదీతో భేటీ అయ్యారు కేజ్రీవాల్. వేర్వేరు అంశాలపై దాదాపు గంటన్నరపాటు మాట్లాడారు. దిల్లీలో హింస, దేశంలో వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ను తరిమికొట్టే చర్యలపై చర్చలు జరిపారు.