ఆన్‌లైన్ మోసాలు, సైబర్ నేరాల బారిన పడుతున్న ప్రముఖుల జాబితాలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుమార్తె హర్షిత కేజ్రీవాల్ చేరారు. ప్రముఖ ఆన్‌లైన్ కొనుగోలు సంస్థ ఓఎల్ఎక్స్లో కొన్ని వస్తువులను ఆమె అమ్మకానికి పెట్టారు. వీటిని చూసిన ఒక వ్యక్తి ఆమెను సంప్రదించాడు. ఆ వస్తువులను కొనుగోలు చేసిన అనంతరం ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లిస్తానని చెప్పాడు.
క్యూఆర్ కోడ్‌తో ..
సదరు నిందితుడు హర్షిత కేజ్రీవాల్ మొబైల్‌కి ఒక క్యూఆర్ కోడ్ పంపి.. ఆ కోడ్‌ను స్కాన్ చేయగానే మీ అకౌంట్లో డబ్బు జమ అవుతుందని నమ్మించాడు. ఆ వ్యక్తి చెప్పినట్టే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే.. హర్షిత ఖాతా నుంచి నిందితుని అకౌంట్‌కి నగదు బదిలీ అయిందని పోలీసులు వివరించారు.
ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న దిల్లీ పోలీసు విభాగం.. కేసును సైబర్ సెల్‌కు బదిలీ చేసినట్టు తెలిపింది.
ఇదీ చదవండి:రూ. 2 స్కాన్ చేస్తే రూ. 4 వస్తే.. రూ. 77వేలు స్కాన్ చేస్తే?