దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్‌గా నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు. ఆయనకు ఉన్న జర్వం ప్రస్తుతం తగ్గిందని, ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించారు.
దిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కరోనా నెగిటివ్ - దిల్లీ సీఎం
18:52 June 09
దిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కరోనా నెగిటివ్
ఆదివారం ఉదయం కేబినెట్ మీటింగ్‌లో పాల్గొన్న కేజ్రీవాల్.. సమావేశం అనంతరం.. అస్వస్థతకు గురైయ్యారు. దీంతో కేజ్రీవాల్ పాల్గొనే అన్ని అధికారిక కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది సీఎం కార్యాలయం. గొంతునొప్పి, జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతున్న ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించాలని సూచించారు వైద్యులు. దీంతో సోమవారం ఉదయం నమూనాలను వైద్యులు సేకరించగా.. నెగిటివ్‌గా నిర్ధరణ అయ్యింది.
18:28 June 09
దిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కరోనా నెగిటివ్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సోమవారం ఉదయం కరోనా పరీక్షలు చేయగా.. నెగిటివ్‌గా తేలింది. జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతూ కేజ్రీవాల్ ఆదివారం స్వీయనిర్బంధంలోకి వెళ్లారు.