తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీకి ఊరట- డీజిల్​పై వ్యాట్ భారీగా తగ్గింపు

డీజిల్​పై వ్యాట్​ను దాదాపు సగానికి తగ్గించింది దిల్లీ ప్రభుత్వం. ప్రస్తుతం 30 శాతం ఉన్న వ్యాట్​ను 16.75 శాతానికి సవరించింది. ఫలితంగా లీటర్ డీజిల్ ధర రూ. 82 నుంచి రూ. 73 .64కి తగ్గింది.

Delhi Cabinet decides to lower VAT on diesel from 30pc to 16.75pc
దిల్లీకి ఊరట- డీజిల్​పై వ్యాట్​ తగ్గించిన కేజ్రీ సర్కార్

By

Published : Jul 30, 2020, 1:21 PM IST

డీజిల్​పై ప్రస్తుతమున్న 30 శాతం విలువ ఆధారిత పన్ను(వ్యాట్​)ను 16.75 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఫలితంగా లీటర్ డీజిల్ ధర రూ. 8.36 తగ్గుతుందని చెప్పారు.

దిల్లీలో ప్రస్తుతం లీడర్ డీజిల్ ధర రూ.82 ఉండగా.. తాజా నిర్ణయంతో అది రూ. 73.64కి తగ్గింది.

దిల్లీ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించడానికి ఈ నిర్ణయం సహాయ పడుతుందని పేర్కొన్నారు కేజ్రీవాల్. దిల్లీ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం తీవ్రమైన సవాలు అని... అయితే ప్రజల సహకారంతో దీన్ని సాధించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:హిందూ మహా సముద్రంలో భారీగా బలగాల మోహరింపు!

ABOUT THE AUTHOR

...view details