అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశ రాజధానిలో విడిది చేసిన వేళ.. దిల్లీ అల్లర్లతో అట్టుడుకుతోంది. ఫలితంగా వివాదాస్పద పౌర చట్టానికి సంబంధించి.. అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణల్లో మృతిచెందిన వారి సంఖ్య ఆరుకు పెరిగింది. మరో 45 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఓ డీసీపీస్థాయి అధికారి కూడా ఉన్నారు.
దిల్లీలో శాంతించని 'పౌర' సెగ.. ఆరుకు చేరిన మృతులు - latest caa protests in delhi
దిల్లీలో హింసాత్మకంగా మారిన సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా ఈ ఘర్షణల్లో మృతి చెందినవారి సంఖ్య 6కు చేరింది.
దిల్లీలో శాంతించని 'పౌర' సెగ.. ఆరుకు చేరిన మృతులు
తెల్లవారుజాము వరకూ అల్లర్లు కొనసాగినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. నిన్నటి నుంచి రాత్రి 3గంటల వరకూ మొత్తం 45 ఫిర్యాదులు అందినట్లు అగ్నిమాపక శాఖ సంచాలకుడు తెలిపారు. ఈ ఘర్షణల్లో తమ సిబ్బంది ముగ్గురు గాయపడినట్లు చెప్పారు. ఆందోళనకారులు ఓ అగ్నిమాపక శకటానికి నిప్పు పెట్టినట్లు వివరించారు.
ఇదీ చదవండి:అట్టుడికిన దిల్లీ.. పౌర హింసలో ఐదుగురు మృతి
Last Updated : Mar 2, 2020, 12:06 PM IST