దేశ రాజధాని దిల్లీలోని రోహిణి ప్రాంతంలో పట్టపగలు భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లో చొరబడిన నలుగురు దొంగలు రూ.50 లక్షల విలువైన సామగ్రిని దోచుకెళ్లారు. సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
దిల్లీలోని ఓ ప్రైవేట్ కంపెనీలో మహ్మద్ ఇమ్రాన్ పనిచేస్తున్నాడు. ఇమ్రాన్ కుటుంబసభ్యులు లేని సమయంలో అతని ఇంట్లోకి నలుగురు చొరబడ్డారు. వీరు లోపలికి వెళుతుండగా వరండాలో ఉన్న సీసీ కెమెరా దృశ్యాలను చిత్రీకరించింది.