తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాహుల్​ క్షమాపణకై దేశవ్యాప్తంగా భాజపా ఆందోళనలు - BJP youth activists protest near Cong office on Rafale deal

రఫేల్​ యుద్ధవిమానాల ఒప్పందం విషయంలో ప్రధాని నరేంద్ర మోదీపై నిరాధార ఆరోపణలు చేసినందుకు నిరసనగా భాజపా దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. రాహుల్​ గాంధీ క్షమాపణలు చెప్పాలని పలు ప్రాంతాల్లో ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు భాజపా కార్యకర్తలు.

రాహుల్​ క్షమాపణకై దేశవ్యాప్తంగా భాజపా ఆందోళనలు

By

Published : Nov 16, 2019, 4:03 PM IST

Updated : Nov 16, 2019, 4:32 PM IST

రాహుల్​ క్షమాపణకై దేశవ్యాప్తంగా భాజపా ఆందోళనలు

రఫేల్​​పై నరేంద్ర మోదీని విమర్శిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని దేశంలోని పలు ప్రాంతాల్లో ఆందోళన చేపట్టింది భాజపా. దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా మహారాష్ట్రలోనూ నిరసన ప్రదర్శనలు చేపట్టారు కాషాయ దళం కార్యకర్తలు. రాహుల్​కు వ్యతిరేకంగా ​నినాదాలు చేశారు. మోదీపై కాంగ్రెస్​ నేత చేసిన వ్యాఖ్యలతో దేశం పరువుపోయిందని మహారాష్ట్ర భాజపా చీఫ్ చంద్రకాంత్ పాటిల్ విమర్శించారు. సుప్రీంకోర్టుకు రాహుల్​ చెప్పిన క్షమాపణలు సరిపోవని వ్యాఖ్యానించారు.

"ప్రపంచంలో భారత్​ను సర్వోత్తమ స్థితిలో ఉంచిన మోదీని... వారు(కాంగ్రెస్, రాహుల్​) కించపరచడానికి ప్రయత్నిస్తున్నారు. కేవలం వారి స్వార్థ ప్రయోజనాల కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. వారి వల్ల దేశం తన ప్రతిష్ఠ కోల్పోవాల్సివస్తోంది. కోర్టు ముందు చెప్పిన క్షమాపణలు సరిపోవు, దేశ ప్రజలకు కాంగ్రెస్, రాహుల్​ గాంధీ క్షమాపణ చెప్పాలి."-చంద్రకాంత్ పాటిల్, మహారాష్ట్ర భాజపా అధ్యక్షుడు.

బంగాల్​లో...

రఫేల్​ విషయంలో దేశ ప్రజలకు అసత్యాలు చెప్పినందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు క్షమాపణలు చెప్పాలని బంగాల్​లో భాజపా కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. మౌలాలీ నుంచి బిధన్​ భవన్​ వరకు ర్యాలీ నిర్వహించిన భారతీయ యువ మోర్చా కార్యకర్తలు... రాహుల్​కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

దిల్లీలోనూ...

దిల్లీలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ తివారీ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది. మోదీపై బురద చల్లడానికి నిరాధారమైన ఆరోపణలు చేసింనందుకు ఆమ్​ ఆద్మీ పార్టీ క్షమాపణ చెప్పాలని కార్యకర్తలు డిమాండ్​ చేశారు.

Last Updated : Nov 16, 2019, 4:32 PM IST

ABOUT THE AUTHOR

...view details