తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీలో మోగిన సమరశంఖం- ఫిబ్రవరి 8న పోలింగ్​

దేశ రాజధాని దిల్లీ శాసనసభ ఎన్నికల షెడ్యూల్​ ఖరారైంది. హస్తినలోని మొత్తం 70 స్థానాలకు ఒకే విడతలో ఫిబ్రవరి 8న పోలింగ్​ జరగనుంది. ఫిబ్రవరి 11న ఫలితాలు వెలువడనున్నాయి.

Delhi Assembly polls on February 8; results to be declared on Feb 11: EC
దిల్లీలో మోగిన ఎన్నికల సమరశంఖం- ఫిబ్రవరి 8న పోలింగ్​

By

Published : Jan 6, 2020, 4:38 PM IST

Updated : Jan 6, 2020, 5:21 PM IST

దిల్లీలో ఎన్నికల నగారా మోగింది. మొత్తం 70 శాసనసభ స్థానాలకు ఫిబ్రవరి 8న ఒకే విడతలో పోలింగ్‌ జరగనుంది. 11వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

ఇదీ చూడండి : కర్ణాటకలో ఘోరం.. సిలిండర్​ పేలి తల్లీకూతుళ్లు మృతి

దిల్లీ ఎన్నికలకు ఈనెల 14న నోటిఫికేషన్ విడుదల కానుండగా.. అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్​ సునీల్​ అరోడా ప్రకటించారు. నామినేషన్ల దాఖలుకు జనవరి 21ని ఆఖరు తేదీగా నిర్ణయించారు. 22న నామినేషన్ల పరిశీలన జరుగుతుందని, ఉపసంహరణకు 24వ తేదీ తుదిగడువని అరోడా వెల్లడించారు. హస్తినలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందని స్పష్టం చేశారు.

"జనవరి 6 నాటికి దిల్లీలో 1,46,92,136 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల కోసం 13 వేలకుపైగా పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. దాదాపు 90వేల మంది సిబ్బంది ఈ క్రతువులో పాల్గొంటారు. ఎన్నికలు పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం."
- సునీల్​ అరోడా, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్​

Last Updated : Jan 6, 2020, 5:21 PM IST

For All Latest Updates

TAGGED:

Gangadhar Y

ABOUT THE AUTHOR

...view details