తెలంగాణ

telangana

ఎయిమ్స్​ వైద్యుడు, గర్భిణి భార్యకు కరోనా

By

Published : Apr 2, 2020, 10:33 PM IST

దిల్లీ ఎయిమ్స్​లోని ఓ వైద్యుడు, అతని భార్యకు కరోనా సోకింది. ఆమె ప్రస్తుతం గర్భిణి. వీరిని ఐసోలేషన్​లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

Delhi Aims doctor tested positive Corona
ఎయిమ్స్​ వైద్యునికి అతని గర్భిణి భార్యకు కరోనా

దేశాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌... వైద్యులకు సోకడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా దిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో సేవలందిస్తోన్న వైద్యునికి కరోనా నిర్ధరణ అయ్యింది. డాక్టర్​తో పాటు గర్భిణి అయిన అతని భార్యకు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేశాయి. వారిని ప్రస్తుతం.. ఆస్పత్రిలోని ప్రత్యేక విభాగం(ఐసోలేషన్)​లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. పుట్టబోయే బిడ్డకు వైరస్​ సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో ఎయిమ్స్​లోని మిగిలిన వైద్యులు అప్రమత్తం అయ్యారు. ముందస్తు జాగ్రత్తగా అన్ని చర్యలు పాటిస్తున్నారు.

ఇదీ చూడండి:2వేలు దాటిన కరోనా కేసులు- 50కిపైగా మృతులు

ABOUT THE AUTHOR

...view details