తెలంగాణ

telangana

ETV Bharat / bharat

16వ లోక్​సభ రద్దుకు రాష్ట్రపతి ఆమోదం - లోక్ సభ రద్దు

16వ లోక్​సభను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. కేంద్ర మంత్రి వర్గం సిఫార్సు మేరకు ఈ ఆదేశంపై సంతకం చేశారు.

పార్లమెంటు

By

Published : May 25, 2019, 2:31 PM IST

Updated : May 25, 2019, 5:28 PM IST

లోక్​సభ రద్దుకు రాష్ట్రపతి ఆమోదం

కేంద్ర మంత్రి మండలి సలహా మేరకు ప్రస్తుత లోక్​సభను రద్దు చేశారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. అనంతరం 17వ లోక్​సభ ఏర్పాటు ప్రక్రియ ముమ్మరం కానుంది.

16వ లోక్​సభకు జూన్​ 3 వరకు గడువుంది. ఈ లోగా సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ఘనవిజయం సాధించింది. తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా ప్రస్తుత లోక్​సభను ముందే రద్దు చేయాలని మంత్రి వర్గం శుక్రవారం నిర్ణయించింది.

మోదీ స్వయంగా.. మంత్రి మండలి రాజీనామా, లోక్​సభ రద్దు ప్రతులను రాష్ట్రపతికి అందజేశారు. మోదీ, మంత్రి వర్గం రాజీనామాలను అదే రోజు ఆమోదించిన కోవింద్​.. తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ప్రధానిగా కొనసాగాలని మోదీని కోరారు. వచ్చే వారం నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది.

ఇటీవల ప్రకటించిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభంజనం సృష్టించింది. 542 స్థానాలకు గాను 348 సీట్లు గెల్చుకుంది. భాజపా 303 స్థానాల్లో గెలిచి... ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని సొంతంగానే సాధించింది.

విజేతల జాబితా అందజేత...

17వ లోక్​సభ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల జాబితాను రాష్ట్రపతికి అందజేశారు ఎన్నికల సంఘం అధికారులు. కోవింద్​ను కలిసిన వారిలో ప్రధాన ఎన్నికల అధికారి సునీల్​ అరోడా ఉన్నారు.

Last Updated : May 25, 2019, 5:28 PM IST

ABOUT THE AUTHOR

...view details