తూర్పు లద్దాక్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్న నేపథ్యంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులను ప్రధానికి వివరించారు. తదుపరి అనుసరించాల్సిన వ్యూహంపై సమాలోచనలు జరిపారు.
గాల్వన్‌లోయ వద్ద చైనా దుస్సాహసానికి ముగ్గురు భారత సైనికులు మృతి చెందారు. దీనితో భారత్ సైనిక దళాలు అప్రమత్తమయ్యాయి. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. త్రివిధ దళాధిపతులు, విదేశాంగ మంత్రితో జైశంకర్‌తో సమావేశమయ్యారు. వాస్తవాధీన రేఖ వెంబడి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.