తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రక్షణ కొనుగోళ్లు వేగవంతానికి ప్రత్యేక కమిటీ - రక్షణ శాఖ మంత్రి

రక్షణ కొనుగోళ్లను వేగవంతం చేసే దిశగా అడుగులు వేస్తోంది కేంద్రం. ఇందుకోసం ప్రస్తుత విధానాన్ని సమీక్షించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు ఆ శాఖమంత్రి రాజ్​నాథ్​సింగ్.

రక్షణ కొనుగోళ్లు వేగవంతానికి ప్రత్యేక కమిటీ

By

Published : Aug 18, 2019, 7:06 AM IST

Updated : Sep 27, 2019, 8:51 AM IST

దేశీయ రక్షణ ఉత్పత్తి రంగ బలోపేతం, సైన్యానికి అవసరమైన కొనుగోళ్లను వేగవంతం చేసే దిశగా అడుగులు వేస్తోంది కేంద్రం. ఇందుకోసం ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాన్ని సమీక్షించేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసే ప్రతిపాదనను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్​సింగ్ ఆమోదించారు.

"రక్షణ అవసరాల కొనుగోళ్ల డైరెక్టర్ నేతృత్వంలో రక్షణమంత్రి రాజ్​నాథ్​సింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వేగవంతమైన కొనుగోళ్లు, మెరుగైన నిర్వహణ కోసం సైనిక సేకరణ విధానం 2016, రక్షణ కొనుగోళ్ల మాన్యువల్​ 2009ని సమీక్షించి ఆరునెలల్లోగా సిఫార్సులు చేస్తుంది."
- రక్షణ శాఖ

విధానపరమైన జాప్యం కారణంగా రక్షణ సామగ్రి కొనుగోలు ఆలస్యమౌతుంది. ఈ నేపథ్యంలోనే సమీక్షకు మొగ్గు చూపింది ప్రభుత్వం. దేశీయ రక్షణ పరిశ్రమకు ప్రోత్సాహం, భారత స్టార్టప్‌లలో పరిశోధన-అభివృద్ధి రంగాల్లో ప్రభుత్వ విధానాలను ప్రోత్సహించే దిశగా ఈ కమిటీ ప్రతిపాదనలు చేయనుంది.

ఇదీ చూడండి: దేశ వ్యాప్తంగా తగ్గని వర్షాలు.. కష్టాల్లోనే ప్రజలు

Last Updated : Sep 27, 2019, 8:51 AM IST

ABOUT THE AUTHOR

...view details