తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రక్షణ శాఖ కార్యదర్శికి కరోనా పాజిటివ్! - Defence secretary ajay kumar coronavirus

రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్​కు కరోనా పాజిటివ్​గా తేలినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ ప్రధాన కార్యాలయంలో జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

Defence secretary ajay kumar
అజయ్ కుమార్ రక్షణ శాఖ కార్యదర్శి

By

Published : Jun 4, 2020, 5:39 AM IST

రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్​ కరోనా బారిన పడ్డట్లు అధికారులు తెలిపారు. అజయ్​ కుమార్​కు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్​గా తేలినట్లు స్పష్టం చేశారు. అయితే.. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయనను హోం క్వారంటైన్​లో ఉంచినట్లు వెల్లడించారు.

కార్యాలయం అప్రమత్తం

అజయ్​ కుమార్​కు కరోనా పాజిటివ్​గా తేలడం వల్ల రక్షణ శాఖ కార్యాలయం అప్రమత్తమైంది. విస్తృతంగా కాంటాక్ట్ ట్రేసింగ్​ను నిర్వహించినట్లు తెలిపింది. సౌత్​ బ్లాక్​లోని రక్షణ శాఖ ప్రధాన కార్యాలయంలో పనిచేసే దాదాపు 35 మంది అధికారులను హోం క్వారంటైన్​కు తరలించింది. ముందు జాగ్రత్తగా రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్ కార్యాలయానికి వెళ్లలేదని అధికారులు తెలిపారు.

అయితే అజయ్ కుమార్ ఆరోగ్యంపై రక్షణ శాఖ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఇదీ చదవండి: ఆబౌద్ధ వారసత్వ సంపద ధ్వంసంపై భారత్​ ఆందోళన

ABOUT THE AUTHOR

...view details