సరిహద్దు వివాదంపై భారత్- అమెరికా రక్షణ మంత్రుల చర్చ!
09:14 June 30
అమెరికా రక్షణ మంత్రికి రాజ్‌నాథ్ ఫోన్!
భారత్-చైనా మధ్య ఉద్రిక్తతల వేళ.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్‌తో ఫోన్లో సంభాషించనున్నట్లు సమాచారం. తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న పరిస్థితులు చర్చకు వచ్చే అవకాశముందని రక్షణ మంత్రిత్వ శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి.
సరిహద్దు సమస్యల పరిష్కారానికై ఇవాళ భారత్-చైనా మధ్య మూడో విడత కమాండర్ స్థాయి భేటీ వేళ.. ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది.
వాస్తవాధీన రేఖ వెంబడి గత నెల నుంచి భారత్‌పైకి కయ్యానికి కాలుదువ్వుతోంది చైనా. ఇదే క్రమంలో సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఈ నెల 6న ఇరు దేశాల మధ్య సైనిక చర్చలు జరిగాయి. కానీ ఈ నెల 15న తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో అనూహ్యంగా భారత సైనికులపైకి దుస్సాహసానికి పాల్పడ్డారు చైనీయులు. 20 మంది భారతీయులను పొట్టనబెట్టుకున్నారు. అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. వేడిని చల్లార్చడానికి మరోమారు సైనిక, దౌత్య స్థాయిలో చర్చలు జరిగాయి. సరిహద్దు వెంబడి సమస్యాత్మక ప్రాంతాల నుంచి బలగాలను ఉపసహరించుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి.