101 రక్షణ దిగుమతులపై నిషేధం..
'ఆత్మనిర్భర్ భారత్'లో భాగంగా రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయుధ సంపత్తి సహా రక్షణ శాఖ ఉత్పత్తులను దేశీయంగానే తయారు చేసుకునేలా 2020-2024 మధ్య వాటి దిగుమతులపై నిషేధం విధించనున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. 101 ఉత్పత్తులను ఇందుకు ఎంపిక చేసినట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
2020-21 ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఉత్పత్తులను దేశీయంగా కొనుగోలు చేసేందుకు 52 వేల కోట్ల రూపాయలతో ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించినట్లు రాజ్‌నాథ్ వెల్లడించారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఉత్పత్తుల కొనుగోళ్ల బడ్జెట్‌ను దేశీయ కొనుగోళ్లు, విదేశీ కొనుగోళ్లుగా విభజిస్తున్నట్లు స్పష్టం చేశారు.