దేశీయంగా రూపొందించిన లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజస్‌లో ప్రయాణించిన తొలి రక్షణశాఖ మంత్రిగా అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నారు రాజ్‌నాథ్ సింగ్. బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయంలో అధికారుల సమక్షంలో తేజస్‌లో విహరించారు. ప్రత్యేక అనుభూతి పొందినందుకు సంతోషం వ్యక్తం చేశారు రాజ్‌నాథ్. ఈ అనుభవాన్ని జీవితంలో మర్చిపోనని చెప్పారు. రాజ్‌నాథ్‌తో పాటు ఎయిర్ వైస్ మార్షల్ తివారీ తేజస్‌లో ప్రయాణించారు.
స్వదేశీ పరిజ్ఞానంతో తేజస్‌ను రూపొందించిన అధికారుల కృషిని ప్రశంసించేందుకు అందులో ప్రయాణించినట్లు తెలిపారు రాజ్‌నాథ్.
" తేజస్ యుద్ధవిమానం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. తేజస్‌లో ప్రయాణించే అవకాశం తొలిసారి దక్కింది. ప్రయాణం చాలా సాఫీగా సాగింది. సౌకర్యంగా ఉంది. నేను ఆస్వాదించా. హెచ్ఏఎల్, డీఆర్డీవో అందరికీ అభినందనలు. తేజస్ కావాలని ఇతర దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రపంచ దేశాలకు యుద్ధ విమానాలు, ఆయుధాలు ఎగుమతి చేసే స్థాయికి మనం ఎదిగాం. "