తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశానికి సేవ చేసిన రియల్‌ హీరో: రాజ్​నాథ్​​ - defence minister rajnath singh express deepest condolence over the death of army dog

దేశానికి సేవలందించిన డచ్​ అనే శునకం ఇటీవల చనిపోయింది. ఈ మేరకు ఏకంగా రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్​ ట్విట్టర్లో సంతాపం వ్యక్తం చేశారు. ఈ శునకం.. దేశానికి సేవ చేసిన 'రియల్‌ హీరో’ అంటూ భారత సైన్యం అభివర్ణించింది.

‘దేశానికి సేవ చేసిన రియల్‌ హీరో'

By

Published : Sep 19, 2019, 3:43 PM IST

Updated : Oct 1, 2019, 5:19 AM IST


భారత సైన్యంలో ఎంతో కాలం సేవలందించిన డచ్​ అనే శునకం ఇటీవల మరణించింది. ఈ శునకం మృతి చెందడం పట్ల ఏకంగా రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్​ చేశారు.

భారత సైన్యం తనకు సేవలు అందించిన ప్రతి ప్రాణిని గుర్తుపెట్టుకొని కృతజ్ఞతలు తెలియజేస్తుంది. సైన్యానికి శునకాలతో భావోద్వేగపూరిత అనుబంధం ఉంటుంది. ఎందుకంటే కీలకమైన ల్యాండ్‌మైన్లను, శత్రువులను ఈ శునకాలే గుర్తించి వారి ప్రాణాలను కాపాడుతాయి. వీటికి సైన్యం ఎంత విలువ ఇస్తుందనే విషయం ఇటీవల జరిగిన ఒక చిన్న సంఘటనతో వెలుగులోకి వచ్చింది.

భారత ఆర్మీలో ఎంతో కాలం సేవలందించిన ‘డచ్‌’ అనే శునకం చనిపోయింది. ఉగ్రవాద పీడిత ప్రాంతాల్లో నిక్షిప్తం చేసిన ఐఈడీలను ఎన్నోసార్లు ‘డచ్‌’ కనిపెట్టి జవాన్లను ప్రాణాపాయం నుంచి తప్పించింది. ఇదే కాకుండా మరెన్నో ఆపరేషన్లలో డచ్‌ తన సేవలందించింది.

ఆర్మీ బృందాల ప్రాణాలను కాపాడిన ఈ శునకం మృతి చెందడం పట్ల ఏకంగా రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ ట్విటర్లో సంతాపం వ్యక్తం చేశారు. ‘దేశానికి సేవ చేసిన రియల్‌ హీరో’ అంటూ ఇండియన్‌ ఆర్మీ దీన్ని అభివర్ణించింది. ఈ మేరకు ఈ విషయాన్ని రక్షణ శాఖ మంత్రిత్వ కార్యాలయం ట్వీట్ చేసింది. తొమ్మిదేళ్ల వయసున్న డచ్‌ గత బుధవారం మృతి చెందింది. ఇందుకు గానూ ‘ఈస్ట్రన్‌ కమాండ్‌’ కూడా ఘనంగా నివాళులు అర్పించింది.

ఇదీ చూడండి : 'చిదంబరం కస్టడీ పొడిగించండి': దిల్లీ కోర్టుకు సీబీఐ వినతి

Last Updated : Oct 1, 2019, 5:19 AM IST

ABOUT THE AUTHOR

...view details