కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం కీలక ప్రాజెక్టుల నిర్మాణాలను ప్రారంభించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పశ్చిమ సెక్టార్ సహా వ్యూహాత్మమైన కీలక సరిహద్దు ప్రాంతాల్లో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది. సరిహద్దుల్లోని అనేక వంతెనల నిర్మాణాలకు రాజ్నాథ్.. ఆన్లైన్ వేదికగా పచ్చజెండా ఊపనున్నట్లు సమాచారం.
నేడు సరిహద్దులో కీలక ప్రాజెక్టులకు రాజ్నాథ్ శంకుస్థాపన - రాజ్నాథ్ సింగ్
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించే ప్రాజెక్టులను చేపడుతున్నట్లు వెల్లడించారు.
సరిహద్దుల్లో కీలక ప్రాజెక్టులకు రాజ్నాథ్ శంకుస్థాపన!
చైనాతో నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై భారత్ దృష్టి పెట్టింది. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించాలని సరిహద్దు రోడ్డు సంస్థ(బీఆర్ఓ)ను ఆదేశించింది కేంద్రం. వీటి పురోగతిని సమీక్షించే ఉన్నత స్థాయి కమిటీతో మంగళవారం భేటీ అయ్యారు రాజ్నాథ్. ఈ సమావేశంలో లద్దాఖ్ సహా, వాస్తవాధీన రేఖ వెంబడి జరుగుతున్న రోడ్డు నిర్మాణ కార్యకలాపాల స్థితిగతులపై చర్చించారు.