కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ చల్లాకరే క్యాంపస్‌లో ,హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్), ఐఐఎస్సీ సంయుక్తంగా నిర్మించిన నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. వీడియా కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆవిష్కరణ, సృజనాత్మకతకు నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి ఎంతో అవసరమని రాజ్‌నాథ్ సింగ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అత్యున్యత విద్యాసంస్థకు, దేశంలో దిగ్గజ ఏరోస్పేస్‌కు మధ్య ఉన్న సహకారానికి ఈ ఎస్డీసీ చక్కటి ఉదాహరణ అని కొనియాడారు.