తెలంగాణ

telangana

రూ.28 వేల కోట్ల రక్షణ కొనుగోళ్లకు ఆమోదం

రూ. 28 వేల కోట్లు విలువ చేసే రక్షణ కొనుగోళ్లు జరపాలనే ప్రతిపాదనకు రక్షణ ఉత్పత్తుల సేకరణ మండలి(డీఏసీ) ఆమోదం తెలిపింది. రాజ్​నాథ్ సింగ్ నేతృత్వంలో గురువారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ శాఖ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

By

Published : Dec 17, 2020, 4:45 PM IST

Published : Dec 17, 2020, 4:45 PM IST

Defence Acquisition Council (DAC) today cleared the acquisition proposals worth Rs 28000 crores
రూ.28వేల ఆయుధ ఉత్పత్తుల సేకరణకు ఆమోదం

సరిహద్దులో చైనా, పాకిస్థాన్​తో ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.28వేల కోట్లు విలువ చేసే ఆయుధాలను సేకరించాలనే ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. రాజ్​నాథ్​ సింగ్ నేతృత్వంలో రక్షణ ఉత్పత్తుల సేకరణ మండలి(డీఏసీ) గురువారం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ శాఖ కార్యాలయం తెలిపింది.

మొత్తం రూ.28 వేల కోట్లలో రూ.27 వేల కోట్ల రక్షణ ఉత్పత్తులను భారత పరిశ్రమల నుంచే సేకరించనున్నట్లు రక్షణ శాఖ కార్యాలయం పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details