తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అక్కడ ప్రకటనలేంటి? - banners

ప్రభుత్వ స్థలాల్లో రాజకీయ ప్రకటనలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే తొలగించాలని తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం.

సుప్రీం కోర్టు

By

Published : Mar 8, 2019, 3:16 PM IST

ప్రభుత్వ స్థలాలను రాజకీయ ప్రకటనల కోసం వాడుకోవటాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. రహదారులపై రాజకీయ పార్టీల బ్యానర్లు, నినాదాలను తొలగించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది.

ప్రభుత్వ స్థలాల్లో రాజకీయ ప్రకటనలు నిషేధించాలంటూ ఓ స్వచ్ఛంద సంస్థ వేసిన వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్​ గొగోయి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. సహజ వనరులు, ప్రభుత్వ స్థలాల్లో ప్రకటనలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని కేంద్రానికి, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

వ్యాజ్యంలో రాజకీయ సంబంధ ప్రకటనలతో పాటు మతపరమైనవి, ప్రైవేటు ప్రకటనలు నిషేధించాలని కోరారు పిటిషనర్లు.

గతేడాది డిసెంబర్​ 19న బ్యానర్లపై నిషేధం విధిస్తూ మద్రాస్​ హైకోర్టు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. తీర్పు అమలు చేయటంలో ప్రభుత్వ వైఫల్యంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఇదీ చూడండి:కేబినెట్ ఆమోదముద్ర

ABOUT THE AUTHOR

...view details