2021-22 విద్యా సంవత్సరం నుంచి సైనిక పాఠశాలల్లో బాలికలకు ప్రవేశం కల్పించడానికి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అనుమతించారు. సైనిక విద్యాసంస్థల్లో బాలికలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని.. తగినంతమంది మహిళా సిబ్బందిని నియమించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
రెండేళ్ల క్రితం మిజోరంలోని చింగ్‌చిప్ సైనిక పాఠశాలలో బాలికలను చేర్పించడానికి రక్షణమంత్రిత్వశాఖ ప్రారంభించిన పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైన నేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
"సైనిక పాఠశాలల్లో బాలికలకు ప్రవేశం కల్పించాలనే నిర్ణయం మరింత సమగ్రంగా.. లింగసమానత్వానికి, సాయుధ దళాల్లో మహిళలకు అవకాశం కల్పించడానికి వీలుకల్పిస్తుంది. ప్రధాని నరేంద్రమోదీ ప్రచారం చేసిన 'బేటీ బచావో, బేటీ పడావో' నినాదాన్ని బలోపేతం చేయడానికి తోడ్పడుతుంది." - రాజ్‌నాథ్‌సింగ్, రక్షణమంత్రి
ప్రభుత్వ పాఠశాల విద్యను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడానికి, గరిష్ఠ సంఖ్యలో క్యాడెట్లను నేషనల్ డిఫెన్స్ అకాడమీకి పంపించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సైనిక పాఠశాలలను రూపొందించింది.
ఇదీ చూడండి:ప్రత్యేక రైలులో విహారం.. బుద్ధుడి చారిత్రక ప్రదేశాల వీక్షణం