తమిళనాడులో ఎంజీఆర్ అమ్మ దీపా పెర్వాయీ పార్టీకి చెందిన నాయకుడు సుబ్రమణియన్ లంచగొండి అధికారిపై వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ట్రాఫిక్ పోలీసు వేషం వేసుకుని తూత్తుకుడి కలెక్టర్ కార్యాలయం ఎదుట లంచాలు వసూలు చేశారు. ఆ సమయంలో కలెక్టర్ లోపలే ఉన్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు సుబ్రమణియన్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. తాను నగరంలో నీటి క్యాన్ల వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు సుబ్రమణియన్. స్థానికుల నుంచి ట్రాఫిక్ పోలీసు ఇన్స్పెక్టర్ ఒకరు తరచుగా లంచాలు తీసుకుంటున్న విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకే ఇలా చేశానని చెప్పారు.