భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం క్షిణిస్తోంది. తాజాగా ఆయనకు ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ సోకినట్లు దిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫెరల్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ప్రణబ్‌ను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ప్రత్యేక వైద్య బృందం ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోందని వెల్లడించారు. దీనిపై ఆర్మీ ఆసుపత్రి తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
మరింత క్షీణించిన ప్రణబ్ ఆరోగ్యం - ప్రణబ్ ముఖర్జీ న్యూస్
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం క్షీణిస్తోందని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్మీ ఆసుపత్రి తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ప్రణబ్
అంతకుముందు, ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ వెల్లడించారు. వైద్యుల నిరంతర కృషి ఫలితంగా ప్రణబ్ కోలుకునే సంకేతాలు కనిపిస్తున్నాయని అభిజిత్ ముఖర్జీ ట్విటర్‌లో తెలిపారు. ఈ సందర్భంలో ప్రణబ్ తొందరగా కోలుకోవాలని ప్రతిఒక్కరూ ప్రార్ధించాలని కోరారు. ఆసుపత్రిలో ఉన్న ప్రణబ్ ముఖర్జీకి కరోనా వైరస్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.
ఇదీ చూడండి:ఆ బస్సు హైజాక్ వార్తలు అవాస్తవం