తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొత్త యూటీ కోసం 'మహా' సీఎం డిమాండ్

మరాఠీ మాట్లాడే ప్రజలు అత్యధికంగా ఉన్న కర్ణాటక సరిహద్దు ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే. ఇరు రాష్ట్రాల వివాదంపై రాసిన పుస్తకావిష్కరణకు హాజరైన ఠాక్రే.. యడియూరప్ప సర్కారు తీరును తప్పుబట్టారు.

Karnataka-Maharashtra border areas as UT
'వాటిని కేంద్ర పాలిత ప్రాంతాలుగా గుర్తించాలి'

By

Published : Jan 27, 2021, 6:26 PM IST

కర్ణాటక పరిధిలోని మరాఠీ మాట్లాడే ప్రాంతాలను.. కేంద్ర పాలిత ప్రాంతాలుగా గుర్తించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే కోరారు. కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదంపై సుప్రీం కోర్టు తుది తీర్పు ఇచ్చే వరకు వాటిని కేంద్ర పాలిత ప్రాంతాలుగానే పరిగణించాలని ముంబయిలో డిమాండ్ చేశారు.

ఇరు రాష్ట్రాల వివాదంపై రాసిన పుస్తకావిష్కరణకు హాజరైన ఠాక్రే.. మరాఠీ ప్రజలపై కర్ణాటక ప్రభుత్వం కఠినంగా ప్రవర్తిస్తోందని ధ్వజమెత్తారు. ఇది పోరాడి గెలవాల్సిన సమయం అని అన్నారు.

ఇదీ చదవండి:దేశంలో 'భాషా జాతీయవాదం' చిచ్చు!

"ఈ కేసుకు సంబంధించి సుప్రీం తీర్పు ఇచ్చే తరుణంలో కర్ణాటక ప్రభుత్వం బెల్గాం ప్రాంతానికి పేరు మారుస్తుంది. ఆ రాష్ట్ర రెండో రాజధానిగా ఈ ప్రాంతాన్ని ప్రకటిస్తుంది. శాసనసభ ఏర్పాటు చేసి సభా కార్యకలాపాలు ఇక్కడే నిర్వహిస్తుంది. ఇది కోర్టు ధిక్కారం కాదా?" అని ఠాక్రే ప్రశ్నించారు.

ఇటీవలే బెల్గాం, కర్వార్, నిప్పాని ప్రాంతాలను తమ ప్రాంతంలో విలీనం చేయాలని మహారాష్ట్ర సీఎం చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప మండిపడ్డారు.

ఇదీ చదవండి:'ఆ ప్రాంతాల విలీనమే నిజమైన నివాళి'

ABOUT THE AUTHOR

...view details