తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'విద్యార్థుల భవిష్యత్తు కోసమే చివరి ఏడాది పరీక్షలు'

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చివరి ఏడాది పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయాల వెసులుబాటును అనుసరించి ఆన్​లైన్​ లేదా ఆఫ్​లైన్​ ద్వారా పరీక్షలు నిర్వహించుకోవచ్చని తెలిపారు.

EDU-UGC-POKHRIYAL
చివరి ఏడాది పరీక్షల నిర్వహణ

By

Published : Aug 18, 2020, 7:01 AM IST

చివరి ఏడాది పరీక్షల నిర్వహణకు యూనియన్​ గ్రాంట్స్​ కమిషన్​ (యూజీసీ) నిర్ణయంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వివరణ ఇచ్చారు. వివిధ విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో సోమవారం భేటీ అయిన రమేశ్.. విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

" విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఈ నిర్ణయం తీసుకున్నాం. విశ్వవిద్యాలయాల వెసులుబాటును బట్టి ఆన్​లైన్​ లేదా ఆఫ్​లైన్​ ద్వారా పరీక్షలు నిర్వహించుకోవచ్చు. కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యావిధానం అంతర్జాతీయ స్థాయిలో భారత్ స్థానాన్ని బలోపేతం చేస్తుంది. 2035 నాటికి విద్యార్థులు స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్​)ను 50 శాతం (3.5 కోట్ల మంది విద్యార్థులు) పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం."

- రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్, కేంద్ర విద్యాశాఖ మంత్రి

చివరి సంవత్సరం పరీక్షల నిర్వహణకు సంబంధించి విశ్వవిద్యాలయాలకు యూజీసీ జులై 6న మార్గదర్శకాలు జారీ చేసింది. వీటిని సవాలు చేస్తూ పరీక్షలు రద్దు చేయాలని సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి.

ఇదీ చూడండి:'కేంద్ర విద్యా శాఖ' పేరుకు రాష్ట్రపతి ఆమోదం

ABOUT THE AUTHOR

...view details