తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తోపుడు బండిపై కరోనా మృతదేహం కలకలం!

తమిళనాడులో కొవిడ్ సోకి మరణించిన ఓ వృద్ధ మహిళ మృతదేహాన్ని ఓ దుప్పట్లో చుట్టేసి, మున్సిపాలిటి తోపుడు బండిపై అంతిమయాత్ర నిర్వహించారు. ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా కరోనా మృతదేహాన్ని వీధుల్లో తీసుకెళ్లిన దృశ్యం చూసిన స్థానికులు భయంతో వణికిపోయారు.

deceased-corona-patients-body-taken-in-a-wheel-barrow-in-streets-of-kudalur-theni-tamilnadu
తోపుడు బండిపై కరోనా మృతదేహం కలకలం!

By

Published : Aug 2, 2020, 8:06 PM IST

కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే వైరస్ సోకినవారికి ఆమడదూరం ఉండాల్సిందే. అందుకే, కరోనాతో మరణించిన మృతదేహాలను కుటుంబ సభ్యులకు సైతం ఇవ్వకుండా.. అత్యంత జాగ్రత్తగా, గాలి కూడ చొరబడకుండా చుట్టేసి పూడ్చేస్తున్నారు వైద్య సిబ్బంది. కానీ, తమిళనాడులో కరోనా బారినపడి మరణించిన 75 ఏళ్ల వృద్ధురాలి మృతదేహాన్ని తీసుకెళ్లే అంబులెన్స్ రాకపోవడం వల్ల... మున్సిపాలిటీ తోపుడు బండిపై అంతిమయాత్ర నిర్వహించారు అధికారులు.

తోపుడు బండిపై కరోనా మృతదేహం కలకలం!

థేనీ జిల్లా , కడలూరులో డయేరియాతో బాధపడుతూ కొద్దిరోజుల క్రితం ఓ మహిళ స్థానిక ప్రాథమిక చికిత్సాలయంలో చేరింది. జూన్ 27న ఆమెకు కరోనా సోకినట్లు నిర్ధరణయ్యింది. దీంతో ఆమెను హోం క్వారంటైన్​లో ఉండమని సూచించారు వైద్యులు. ఇంటికొచ్చేసిన ఆమె జులై 31న మృతి చెందింది. దీంతో మృతదేహాన్ని త్వరగా పూడ్చిపెట్టేయాలని చుట్టుపక్కలవారు ఒత్తిడి చేశారు.

మున్సిపాలిటీ అధికారులు అంబులెన్స్ తెప్పించే ప్రయత్నం చేశారు. కానీ, గంటలు గడిచినా అంబులెన్స్ రాలేదు. ఓ పక్క ఇరుగుపొరుగు అంత్యక్రియలు వెంటనే పూర్తిచేయాలని గగ్గోలుపెట్టారు. దీంతో, ఓ దుప్పట్లో ఆమె మృతదేహాన్ని చుట్టేసి ఓ తోపుడు బండిపై శ్మశానానికి తీసుకెళ్లాడు మున్సిపాలిటీ కార్మికుడు.

జనసంచారంలో, వీధుల్లో ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా ఓ కరోనా మృతదేహాన్ని, తోపుడుబండిపై తీసుకెళ్లడం చూసిన స్థానికులకు భయంతో చెమటలుపట్టాయి.

ఇదీ చదవండి:'ఐసీయూలోనూ స్మార్ట్​ఫోన్​ వాడుకోనివ్వండి!'

ABOUT THE AUTHOR

...view details