తెలంగాణ

telangana

By

Published : Dec 19, 2019, 7:31 AM IST

ETV Bharat / bharat

ప్లాస్టిక్​పై సమరం: 'చెత్త కేఫ్​' ఆలోచనకు ప్రశంసలు

ఛత్తీస్​గఢ్​ అంబికాపుర్​లోని 'చెత్త కేఫ్'​.. ప్లాస్టిక్​ వ్యర్థాలకు బదులుగా ఆహారం అందిస్తోంది. పేదల ఆకలి తీర్చుతూనే ప్లాస్టిక్​ భూతాన్ని తరిమికొట్టాల్సిన ఆవశ్యకతను తెలియచెబుతోంది. అందుకే అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందుతోంది.

ప్లాస్టిక్​పై సమరం
ప్లాస్టిక్​పై సమరం

ప్లాస్టిక్​పై సమరం
ప్లాస్టిక్​ భూతాన్ని తరిమేసేందుకు ఛత్తీస్​గఢ్​ అంబికాపుర్​లో ప్రారంభించిన చెత్త కేఫ్​.. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ప్లాస్టిక్​ వ్యర్థాలను సేకరించి, నగరాన్ని పరిశుభ్రంగా మార్చాలన్నది... ఈ కేఫ్​ ఏర్పాటు వెనుక ఉద్దేశం.

అంబికాపుర్‌ నగరపాలక సంస్థ నిరాశ్రయుల కోసం దేశంలోనే తొలిసారిగా 'గార్బేజ్ కేఫ్' పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఒక కిలో ప్లాస్టిక్ వ్యర్థాన్ని తెచ్చిస్తే భోజనం, అరకిలో ప్లాస్టిక్ తెచ్చిస్తే అల్పాహారం పెడతారు.

రోడ్ల నిర్మాణానికి..

అక్టోబర్​ 9న ప్రారంభమైన ఈ కేఫ్​లో నోరూరించే ఆహారం అందిస్తున్నారు. రోజూ సుమారు 10 నుంచి 20 కిలోల ప్లాస్టిక్​ వ్యర్థాలను సేకరిస్తున్నారు. వీటిని నగరపాలక సంస్థకు చెందిన సానిటరీ పార్క్​ రీసైక్లింగ్​ కేంద్రానికి పంపిస్తారు.

ఈ వ్యర్థాలను ఉపయోగించి నగరంలో రోడ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది అంబికాపుర్ నగరపాలక సంస్థ. ఈ కార్యక్రమంతో మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.

స్థానికుల ఆదరణ

ఈ కేఫ్​ను ఈటీవీ భారత్​ ప్రతినిధి బృందం సందర్శించినప్పుడు పరిసరాలు శుభ్రంగా కనిపించాయి. చిన్నారులు కూడా బాగానే వస్తున్నారు. ఈ గొప్ప ప్రయత్నంతో స్థానికుల్లోనూ ప్లాస్టిక్​పై అవగాహన పెరుగుతోంది.

ఇదీ చూడండి: 'చెత్త కేఫ్'​ షురూ- కిలో ప్లాస్టిక్​కు భోజనం, అరకిలోకు టిఫిన్​

ABOUT THE AUTHOR

...view details