తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భవనం కూలిన ఘటనలో 13కు మృతుల సంఖ్య - DHARWAD

కర్ణాటక ధార్వాడ్​లో భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 13కు చేరింది. శిథిలాల వెలికితీత కొనుసాగుతోంది.

ధార్వాడ్​లో భవనం కుప్పకూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య

By

Published : Mar 22, 2019, 6:58 AM IST

ధార్వాడ్​లో భవనం కుప్పకూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
కర్ణాటక ధార్వాడ్​లో​ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 13కు పెరిగింది. మూడో రోజు సహాయక చర్యల్లో శిథిలాల నుంచి 5 మృతదేహాలు వెలికితీశారు. ఇప్పటి వరకు మొత్తం 56 మందిని రక్షించారు. ఇంకా 12 మంది శిథిలాల కింద ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.

భవన నిర్మాణానికి డిజైన్ రూపొందించిన ఇంజనీర్ వివేక్ పవార్​ను పోలీసులు అరెస్టు చేశారు. వివేక్​తో పాటు మరో నలుగురు నిందితులు కర్ణాటక మాజీ మంత్రి వినయ్​ కులకర్ణికి దగ్గరి బంధవులని పోలీసు వర్గాలు తెలిపాయి.

కర్ణాటక సీఎం హెచ్​డీ కుమారస్వామి ఘటనా స్థలంలో సహాయక చర్యలను పరిశీలించారు. ప్రమాదంపై దర్యాప్తునకు జిల్లా అధికారులను అదేశించామని తెలిపారు. అవసరమైతే ఉన్నత స్థాయి విచారణ జరిపిస్తామని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details