కుండపోత వర్షాలకు మహారాష్ట్ర అతలాకుతలమవుతోంది. నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు 53 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. రాష్ట్రంలో ఈ రోజూ భారీ వర్షాలు కురుస్తాయన్న వార్తలు ప్రజల గుండెల్లో గుబులు రేపుతున్నాయి.
అర్ధరాత్రి విషాదం...
భారీ వర్షాలకు రాష్ట్రంలోని నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. రత్నగిరి జిల్లా తివారేలోని డ్యామ్‌కు గండి పడి 11 మంది మృతి చెందారు. మరో 20 మంది గల్లంతయ్యారు. అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. 12-15 ఇళ్లు కొట్టుకుపోయాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.