దేశంలో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. 721 మంది కొత్తగా వైరస్ బారినపడ్డారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మహారాష్ట్రలో శరవేగంగా...
మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మొత్తం రోగుల సంఖ్య 2,916కు చేరింది. మహారాష్ట్రలో మృతుల సంఖ్య 187కు పెరిగింది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 1,896 కేసులుండగా 114 మంది మహమ్మారికి బలైపోయారు.
గుబులు...
దిల్లీలో వైరస్ బాధితుల సంఖ్య 1578కి పెరిగింది. మృతుల సంఖ్య 32కు చేరింది. 40 మంది కోలుకున్నారు. తమిళనాడులో కేసుల సంఖ్య 1,242కు చేరింది. మరణించినవారి సంఖ్య 14కు చేరింది.
మధ్యప్రదేశ్‌లో మొత్తం కేసుల సంఖ్య 987కు పెరిగింది. ఇప్పటివరకు 53 మంది వైరస్‌కు బలయ్యారు. మృతుల సంఖ్యలో మహారాష్ట్ర తర్వాత స్థానం మధ్యప్రదేశ్‌దే.
కర్ణాటకలో మరో వ్యక్తి కరోనాకు బలయ్యాడు. రాష్ట్రంలో మృతుల సంఖ్య 13కు చేరింది. 279 కేసులు నమోదయ్యాయి.
1000 దాటిన రాష్ట్రాలు...
దేశంలో నాలుగు రాష్ట్రాల్లో 1000కిపైగా కేసులు నమోదయ్యాయి. ఆ జాబితాలో 2,916 కేసులతో మహారాష్ట్ర తొలిస్థానంలో ఉంది.
- మహారాష్ట్ర- 2,916
- దిల్లీ-1,578
- తమిళనాడు-1,242
- రాజస్థాన్-1,023