భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,118 మందికి కరోనా సోకగా... 39 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 11,933కి చేరింది. 392 మంది కరోనా కాటుకు బలయ్యారు. 1,343 మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు.
మహారాష్ట్ర అతలాకుతలం
దేశంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో... పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 2,918కి పెరిగింది. ఒక్క ముంబయిలో కొత్తగా 183 కేసులు నమోదుకాగా... మొత్తం కేసుల సంఖ్య 1936కి చేరింది. ఇవాళ ఇద్దరు కరోనా మృతి చెందగా.. మరణాల సంఖ్య 113కి పెరిగింది. 181 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
కరోనా మృతుల్లో భోపాల్ దుర్ఘటన బాధితులు
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇక్కడ కొత్తగా 117 కరోనా కేసులు నమోదైనందున మొత్తం కేసుల సంఖ్య 544కి పెరిగింది. వీరిలో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నగరంలో మరణాల రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా...6.8 శాతంగా ఉంది.
మరోవైపు భోపాల్లో కరోనాతో మృతి చెందిన ఐదుగురు వ్యక్తులు.... 1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులని అధికారులు తెలిపారు.
రాజస్థాన్లో పెరుగుతున్న కరోనా కేసులు
రాజస్థాన్లో ఇవాళ కొత్తగా 41 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 1,046కి చేరింది. వైరస్ కారణంగా ఇవాళ 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర్ప్రదేశ్లోనూ 67 కేసులు బయటపడగా.. ఇవాళ మరో ముగ్గురు మృతి చెందారు. దిల్లీలో కేసులు తగ్గుముఖం పట్టనందున కరోనా రోగులకు ప్లాస్మా చికిత్స అందించాలని దిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది.
ఉత్తరాఖండ్లో మాత్రం ఇవాళ ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో కేవలం 37 కేసులు మాత్రమే నమోదయ్యాయి. కేరళలోనూ ఈరోజు ఒక్క కేసు మాత్రమే నమోదవడం గమనార్హం.
రూపానీకి కరోనా లేదు