భారత్‌లో అత్యంత వేగంగా వ్యాపిస్తోన్న కరోనా వైరస్ కేసుల సంఖ్య 10వేలు దాటింది. గడచిన 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా వేయికి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో దాదాపు 700 కేసులు దిల్లీ, మహారాష్ట్రలోనే నిర్ధరణ అయ్యాయి.
ఫలితంగా దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,815కి చేరిందని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ వైరస్ బారినపడి 353 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం బాధితుల్లో 1,190 మంది కోలుకోగా ప్రస్తుతం మరో 9,272 మంది చికిత్స పొందుతున్నారు.
మహారాష్ట్రలోనే సగం..
దేశంలో సంభవించిన కరోనా మరణాల్లో సగం మహారాష్ట్రలోనే చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలో కొవిడ్ మృతుల సంఖ్య 160కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 349 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితులు 2,334కు చేరారు.
దిల్లీ, తమిళనాట తీవ్రస్థాయిలో..