భారత్‌లో కరోనా కేసులు 53వేలకు చేరువయ్యాయి. గడిచిన 24 గంటల్లోనే మరో 89 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 3561 మంది వైరస్ బారిన పడ్డారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు వెల్లడించింది.
మహారాష్ట్రలో మృతుల సంఖ్య 651కి చేరింది. రాష్ట్రంలో 16 వేల 758 మంది వైరస్ బారినపడ్డారు. మరో 3094 మంది కోలుకున్నారు.
గుజరాత్లో 396, మధ్యప్రదేశ్‌లో 185 మంది కొవిడ్‌కు బలయ్యారు.