తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిహార్​: 104కు చేరిన 'ఏఈఎస్' మృతులు​

బిహార్​లోని ముజఫర్​పుర్​లో అనుమానిత అక్యూట్​ ఎన్​సెఫాలిటిస్​ సిండ్రోమ్​ బారినపడి మరణించిన చిన్నారుల సంఖ్య 104కు చేరింది. సంఖ్య నానాటికీ పెరుగుతుండటం కలవరపెడుతోంది. జాతీయ మానవహక్కుల సంఘం కేంద్ర ఆరోగ్య శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ విషయంపై నివేదిక ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.

బిహార్​: 104కు చేరిన 'ఏఈఎస్' మృతులు​

By

Published : Jun 17, 2019, 8:36 PM IST

బిహార్​లో అనుమానిత అక్యూట్​ ఎన్​సెఫాలిటిస్​ సిండ్రోమ్-ఏఈఎస్​ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ముజఫర్​పుర్​లో నేడు మరికొందరు పసివాళ్లు ప్రాణాలు విడిచారు. ఫలితంగా ఏఈఎస్​కు బలైన వారి సంఖ్య​ 104కు చేరింది.

ఎన్​హెచ్​ఆర్​సీ నోటీసులు...

చిన్నారుల మృతిపై జాతీయ మానవ హక్కుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు తీసుకొన్న చర్యలపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ఆరోగ్య శాఖకు ఎన్​హెచ్​ఆర్​సీ నోటీసులు జారీ చేసింది.

పదేళ్ల లోపు చిన్నారులే...

పదేళ్ల లోపు చిన్నారులే ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. జూన్​ 1 నుంచి 197 మంది చిన్నారులు ఆసుపత్రుల్లో చేరారు. బిహార్​లోని 12 జిల్లాల్లో 222 ప్రాంతాల్లో ఈ కేసులు నమోదవుతున్నట్లు అధికారులు గుర్తించారు.

వైద్యులు మాత్రం... చిన్నారుల మృతికి ఏఈఎస్ (మెదడు వాపు వ్యాధి)​ కారణం కాదని, రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోవడం(హైపోగ్లైసీమియా) వల్లనే వారు చనిపోతున్నారని చెప్పారు. "గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం, ఇతర కారణాల వల్ల రాత్రిపూట పిల్లలు ఆహారం తీసుకోవడంలేదు. ఇలా ఖాళీ కడుపుతో నిద్రపోతే పిల్లల రక్తంలో గ్లూకోజ్​ స్థాయిలు తగ్గే ప్రమాదముంది" అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details