ఉత్తరప్రదేశ్ ముజఫర్నగర్జిల్లాలోని ఓ పాఠశాలలో జరిగిన ఘటన.. మధ్యహ్న భోజనం పథకంలో పిల్లలకు అందించే ఆహారం పట్ల నిర్లక్ష్యపూరితి వైఖరిని తెలియజేస్తోంది. విద్యార్థులకు పౌష్టికాహారం అందిచాల్సిన అధికారులు అలసత్వం ప్రదర్శించారు. ఫలితంగా మధ్యాహ్న భోజనంలో చనిపోయిన ఎలుక ప్రత్యక్షమైంది.
అప్పటికే తినేసిన విద్యార్థులు
ఎలుకని గుర్తించినప్పటికే... విద్యార్థులు ఆహారాన్ని తినేశారు. ఆ చచ్చిన ఎలుకను చూడగానే ఎనిమిది మంది విద్యార్థులు, ఓ ఉపాధ్యాయురాలు అనారోగ్యానికి గురై... వాంతులు చేసుకున్నారు. తక్షణమే వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.
కేసు నమోదు
ఈ ఆహారాన్ని జన్‌కల్యాణ్ సమితి స్వచ్ఛంద సంస్థ వారు పంపిణీ చేశారు. ఈ సంస్థపై కేసు నమోదు చేసి విచారణ జరపాల్సిందిగా జిల్లా అదనపు మేజిస్ట్రేట్.. పోలీసులకు ఆదేశించారు. నిందితులపై కఠిన చర్య తీసుకుంటామన్నారు.
గతంలో ఇదే తరహా
గతంలోనూ పలుమార్లు ఇలాంటి ఘటనలు జరిగాయి. గత వారం సోన్‌భద్రలో ఒక లీటరు పాలల్లో 20 లీటర్ల నీళ్లు కలుపుతూ పట్టుబడిన విషయం వెలుగులోకి వచ్చింది. రెండు నెలల క్రితం ఓ పాఠశాలలోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో ఒక రొట్టెతో పాటు అందులోకి ఉప్పును వడ్డించిన ఘటన వెలుగు చూసింది. అయితే తాజా ఘటనతో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది.
ఇదీ చూడండి : డాక్టర్ 'దిశ'కు న్యాయం కోసం 15 లక్షల సంతకాలు