తెలంగాణ

telangana

ETV Bharat / bharat

30 ఏళ్లపాటు సేవలందించిన నౌక ఆఖరి యాత్ర - viraat ship last journey

భారత నౌకా దళంలో ముప్పై ఏళ్ల పాటు విమాన వాహకంగా సేవలందించిన ఐఎన్‌ఎస్‌ విరాట్‌ నౌక ఆఖరిసారిగా సముద్రంలో పయనించనుంది. అనంతరం తుక్కుగా మారిపోనుంది.

de-commissioned-ins-viraat-moves-out-of-the-naval-dockyard-for-ship-breaking-yard-in-gujarat
30 ఏళ్లు భారత యుద్ధ విమానాలు మోసిన నౌక తుది యాత్ర!

By

Published : Sep 19, 2020, 5:28 PM IST

మూడు దశాబ్దాల పాటు భారత నౌకా దళానికి సేవలందించిన ఐఎన్‌ఎస్‌ విరాట్‌ విమాన వాహక నౌక చివరి సారిగా సముద్రంలో ప్రయాణించనుంది. ముంబయి నుంచి గుజరాత్‌లోని అలాంగ్‌ వరకు తుది యాత్ర పూర్తయ్యాక.. ముక్కలుగా వేరై తుక్కుగా మారనుంది.

విరాట్‌ నౌక జీవిత కాలం పూర్తయ్యింది. దీంతో 2017 మార్చిలోనే నౌకాదళం నుంచి దీనిని ఉపసంహరించారు అధికారులు. అప్పటి నుంచి ముంబయి తీరంలో ఉంచుతున్నారు. మొదట దీనిని మ్యూజియంగా కానీ రెస్టారెంట్‌గా గానీ మార్చేందుకు ప్రయత్నించారు. కానీ, ఆ ప్రణాళికలు ఫలించలేదు. దీంతో తుక్కుగా మార్చి, విక్రయించేందుకు నిర్ణయించారు.

ఐఎన్‌ఎస్‌ విరాట్‌ తొలుత బ్రిటన్ కు చెందిన రాయల్‌ నేవీలో హెచ్‌ఎంఎస్‌ హెర్మిస్‌గా సేవలందించింది. అనంతరం భారత నావిక దళంలోని ప్రవేశించి ముప్పై ఏళ్ల పాటు సేవలందించింది.

ఇదీ చదవండి: చైనాకు సమాచారం చేరవేస్తున్న జర్నలిస్ట్​ అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details